ఒక్క ఐడియా నిరుద్యోగి జీవితాన్ని మార్చేసింది..

  0
  727

  వెరైటీ ఐడియాతో ఉద్యోగం సంపాదించాడు..
  ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ యువకుడు ఒక సరికొత్త ఐడియాతో నాలుగు గంటల్లో ఉద్యోగం పట్టేశాడు. వీడి తెలివికి మెచ్చి ఓ పెద్ద కంపెనీ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. అప్పటి వరకు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 24ఏళ్ల హైదర్ మాలిక్ అనే యువకుడు తాను ఖాళీగా ఉన్నానని, ఒక ప్లకార్డ్ పట్టుకుని లండన్ రైల్వే స్టేషన్లో నిలబడ్డాడు. ఆ ప్లకార్డులోనే తన క్యూఆర్ కోడ్ ప్రింట్ చేశాడు. బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ లో యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ పాసయ్యానని, తనకి ఉద్యోగం కావాలని, తన రెజ్యూమ్ క్యూఆర్ కోడ్ ఒకవైపు, ఇంకోవైపు లింక్డిన్ ప్రొఫైల్ క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసుకుని ప్లకార్డ్ పట్టుకుని రైల్వే స్టేషన్లో నిలబడ్డాడు. ఇలా నిలబడ్డ నాలుగు గంటల్లోగా అతనికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, వెంటనే ఉద్యోగం కూడా వచ్చింది. బీఎస్సీ బ్యాంకింగ్ ఫైనాన్స్ లో ఫస్ట్ క్లాస్ పాసయినా ఉద్యోగం రాలేదని, ఇలా వెరైటీ ఐడియాతో వచ్చినందుకే ఉద్యోగం వచ్చిందని చెబుతున్నాడు అతను.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.