ఉదయాన్నే ఇవి తాగితే.. షుగర్ కు చెక్ ..

  0
  6330

  మానవ జీవితంలో వేగం పెరిగే కొద్దీ.. మనుషులకు వచ్చే జబ్బుల సంఖ్య కూడా పెరిగింది. అందులో అతి ముఖ్యమైనది, కామన్ గా వినిపించేది షుగర్ వ్యాధి. దీన్ని ఓ వ్యాధి అనొద్దని, ఒక వయసు దాటిన తర్వాత అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామి అయిపోయిందని అంటుంటారు వైద్యులు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షుగర్ ని అదుపులో పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదని అంటుంటారు మరికొందరు.

  మెంతులనుంచి వచ్చే కొత్తిమీర వాడినంతగా మెంతి గింజలను మనం వాడం. ఎందుకంటే ఇవి కొంచెం చేదుగా ఉంటాయి. అయితే ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతులతో ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఇది ఔషధం మొదలుకొని సౌందర్య సాధనం వరకు అన్ని రకాల ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. మెంతి గింజల్లో విటమిన్ సి, బి1, బి2, కాల్షియం వంటి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మం మెరిసేలా చేయడంతోపాటు జట్టు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఉదయం పూట పరిగడుపున మెంతి గింజల నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. అలాగే మధుమేహం, మలబద్ధకం వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.

  మెంతి నీరు తయారు చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. ఒకటి, ఒకటిన్నర చెంచాల మెంతి గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని ఫిల్టర్ చేయాలి. అనంతరం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. వడగట్టగా మిగిలిన మెంతి గింజలను విసిరేయకుండా వంటల్లో వాడుకోవచ్చు లేదా తినొచ్చు.

  మెంతి కూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెంతి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వీటిని వివిధ సౌందర్య సాధనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. మెంతి ఆకుల్లో ఉండే ప్రొటీన్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మెంతి నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు సంబంధ సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మెంతి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. మెంతి గింజల నీరు గుండెలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. పురాతన కాలం నుంచి మధుమేహాన్ని నియంత్రించేందుకు మెంతి గింజలను వాడుతుంటారు. ప్రతీ నిత్యం మెంతి నీరు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. మెంతి గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి గింజ నీటిని నిత్యం 3 సార్లు తీసుకుంటే చాలా వరకు డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..