డబ్బు కోసం మొగుడు చనిపోయాడని చెప్పింది..

    0
    157

    భర్త ఇన్సూరెన్స్ డబ్బులకోసం నకిలీ సర్టిఫికెట్ తీసుకున్న భార్య, కొడుకు అందరూ కలసి జైలు పాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని దివాస్ లో అబ్దుల్ హనీఫ్ అనే వ్యక్తి కోటి రూపాయలకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. 2019లో పాలసీ తీసుకుని ఏడాది ఇన్ స్టాల్ మెంట్ లెక్కన 2020, 2021లో పాలసీ డబ్బులు చెల్లించాడు. తర్వాత నెల రోజుల క్రితం గుర్తు తెలియని ఓ శవాన్ని ఆస్పత్రిలోనే చూపించి పోస్ట్ మార్టమ్ చేయించి అది తన భర్తదిగా ఆయన భార్య రెహనా, కొడుకు ఇక్బాల్ కలసి నమ్మించారు.

    ఈమేరకు నెలరోజుల క్రితం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకుని హనీఫ్ చనిపోయినట్టు సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. ఇన్సూరెన్స్ అధికారులకు అనుమానం వచ్చి వారింటి చుట్టుపక్కల విచారించారి. హనీఫ్ బతికే ఉన్నాడని నిర్థారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హనీఫ్, భార్య రెహనా, కొడుకు ఇక్బాల్ ని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..