మళ్ళీ ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..

  0
  14120

  ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాలకు ,మళ్లీ ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రం మీద కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

  పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోవు 4 రోజులు పాటు దక్షిణకోస్తా-తమిళనాడు తీరాల వెంబడి గంటకు 40 -60 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయి.. సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని పేర్కొంది.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..