నానమ్మ దగ్గరికి వెళ్తున్నా.. ఇదే నా చివరి సెల్ఫీ వీడియో..

  0
  13128

  ఆత్మహత్య చేసుకునేవారు ఇదే నా చివరి లేఖ అంటూ ఓ లెటర్ రాసిపెట్టి చనిపోవడం గతంలో జరిగేది. సూసైడ్ నోట్ ని ఆధారంగా చేసుకుని పోలీసులు కూడా కేసు వ్యవహారంలో ముందుకెళ్లేవారు. కానీ ఇప్పుడు రాసే ఓపిక ఎవరికీ లేదు. ట్రెండ్ మారింది, సూసైడ్ చేసుకునేవారిలో చాలామంది ఇప్పుడు సూసైడ్ కి కాసేపు ముందు అంటూ సెల్ఫీ వీడియోలి రికార్డ్ చేస్తున్నారు. దాన్ని ఫ్రెండ్స్ కి పంపించి బాల్చీ తన్నేస్తున్నారు.
  సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ జవహర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కార్పొరేషన్‌ పరిధిలోని వెంకటేశ్వరకాలనీలో నివసించే ఆటో మల్లేశం కుమారుడు అశోక్‌ (28) కొరియర్‌ బోయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అశోక్‌ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ‘నేను నానమ్మ దగ్గరకు వెళ్తున్నాను. ఇదే నా చివరి వీడియో. నేను నిజంగా ఉరి వేసుకుంటున్నా..’ అని చెబుతూ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో క్లిప్‌ను వాట్సప్ లో ఫ్రెండ్ కి పంపించి ఆ తర్వాత ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి వెళ్లే సరికి డెడ్ బాడీ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకుంటున్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..