జగన్, షర్మిల మధ్య గొడవలపై డిప్యూటీ సీఎం క్లారిటీ..

  0
  178

  సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకున్న అంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్నా చెల్లెల్ల మధ్య తగాదా పెట్టేందుకు ప్రయత్నించొద్దని అన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి భేదాలు, మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి ఆంధ్ర, తెలంగాణ మధ్య అనే తేడాలు లేవని, అందరం తెలుగువారమేనని, అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జలవివాదానికి చంద్రబాబే కారణం, అసలింతవరకూ చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని సలహాలిచ్చే బాబు ఇప్పుడెందుకు మాట్లాడ్డంలేదని అన్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.