వామ్మో .. ఈ కారవాన్ ఇన్ని కోట్లా.. ?

  0
  4191

  సినిమా యాక్ట‌ర్ల‌కు, సెల‌బ్రిటీల‌కు విలాస‌మైన కార్వాన్ లు ఇటీవ‌లకాలంలో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు దేశంలో వీఐపీలు, సెల‌బ్రిటీలు కార్వాన్ వ్యాన్ ల‌పై మోజు ప‌డుతుండ‌డంతో జ‌ర్మ‌న్ ఓక్న‌ర్ కంపెనీ ఫైవ్ స్టార్ కార్వాన్ వ్యాన్ ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధ‌ర 19 కోట్లు. ఈ కార్వాన్ వ్యాన్ లోనే కారు పార్కింగ్ కూడా లోప‌లే ఉండ‌డం విశేషం. మ‌రో ర‌కం ప్యాకేజీలో 21 కోట్ల విలువ చేసే బుగాటీ చిరాన్ కారుతో స‌హా 40 కోట్ల కార్వాన్ వ్యాన్ ను కూడా సిద్ధం చేసింది.

   

  సోలార్ ప్యాన‌ల్ రూఫ్‌, ట‌చ్ బ‌ట‌న్స్, మేక‌ప్ రూమ్, విలాస‌మైన డైనింగ్ హాల్, డ్రాయింగ్ హాల్, బెడ్ రూమ్, వాష్ రూమ్, కిచెన్‌, డ్రెస్సింగ్ రూమ్ ఇలా ఫైవ్ స్టార్ హోట‌ల్ ను మించిపోయే విధంగా ఈ కార్వాన్ త‌యారైంది.

  ఇప్పుడు హాలీవుడ్ సెల‌బ్రిటీల త‌ర్వాత ఈ కార్వాన్ వ్యాన్ కు మ‌న‌దేశం నుంచి ఫిల్మ్ సెల‌బ్రిటీలు కూడా ఆర్డ‌ర్ చేశార‌ని తెలుస్తోంది. ఈ కార్వాన్ వ్యాన్ డెలివ‌రీని మ‌న‌దేశంలో సెల‌బ్రిటీల నుంచి ఆర్డ‌ర్లు తీసుకున్నార‌ని స‌మాచారం.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..