రోడ్డుకు అడ్డమైతే ఏదైనా కూల్చేయండి..

    0
    140

    రోడ్ల‌ను ఆక్ర‌మించి క‌ట్టిన ప్రార్ధ‌నా మందిరాలు, దేవాల‌యాలు తొల‌గించాల్సిందేన‌ని అల‌హాబాద్ హైకోర్టు అల్టిమేటం ఇచ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2011 జ‌న‌వ‌రి 1 త‌ర్వాత రోడ్ల‌కు అడ్డంగా క‌ట్టినా, లేదా రోడ్ల మార్జిన్ స్థ‌లాల్లో క‌ట్టిన ఏ ప్రార్ధ‌నా ప్ర‌దేశాన్ని అయినా తొల‌గించేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్న సందుల్లో కూడా ఇటువంటి ప్రార్ధ‌నా మందిరాలు వుంటే తొల‌గిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో రెండు నెల‌ల్లోగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నారో జిల్లా క‌లెక్ట‌ర్లు బాధ్య‌త వ‌హించి కోర్టుకు తెలియ‌జేయాల‌ని ఆదేశించింది. ఉత్త‌రప్ర‌దేశ్ లోని అన్ని ప్రాంతాల్లో అక్ర‌మంగా నిర్మించిన ప్రార్ధ‌నా మందిరాల్లో ఆరు నెల‌ల్లోపు తొల‌గించేందుకు ఒక ప్ర‌ణాళిక కూడా సిద్ధం చేశారు. దీన్ని పాటించ‌క‌పోతే కోర్టు ధిక్కారం కింద ప‌రిగ‌ణించి సంబంధిత అధికారుల‌ను శిక్షిస్తామ‌ని కూడా హైకోర్టు హెచ్చ‌రించింది. ప్ర‌జ‌లు మ‌రియు వాహ‌న రాక‌పోక‌ల‌కు అడ్డంగా ఉండే ఏ ప్రార్ధ‌నా మందిరాన్ని అయినా నిర్ధాక్షిణ్యంగా కూల్చేయాల‌ని ఆదేశించింది. 2016లోనే అల‌హాబాద్ హైకోర్టు ఈ ర‌క‌మైన ఆదేశాలు ఇచ్చినా, ఇంత‌వ‌ర‌కు అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??