చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రామజన్మ భూమి అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి.. అయోధ్య మొత్తాన్ని దీపాలు , లేజర్ లైటింగ్ తో నింపేశారు.
అడుగడుగునా మిరుమిట్లుగొలిపే విద్యుద్దీప కాంతులతో నగరం మొత్తం ధగధగలాడుతుంది. ముఖ్యమంత్రి యోగిఆదిత్యానాధ్ , స్వయంగా లైటింగ్ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.. నది ఒడ్డున లక్ష ప్రమిదలతో దీపాలు వెలిగించారు.
రాముడు అరణ్యవాసం ముగించుకొని , తిరిగివచ్చినప్పుడు , అయోధ్య దీపకాంతులతో వెలిగిపోయింది , అదే విధంగా ఈ యుగంలోనూ అయోధ్యను దీపకాంతుల్లో నింపి , దీపావళి చేస్తున్నామని సీఎం యోగి చెప్పారు..