తల్లి బ్రతికొస్తుందని శవంతో ఇద్దరు కూతుళ్లు..

  0
  193

  జీస‌స్ పున‌రుత్తాన‌మైన‌ట్లు త‌మ త‌ల్లి కూడా బ‌తికి వ‌స్తుంద‌ని ప్రార్ధ‌న‌లు చేశారు కూతుళ్ళు. అయితే వీరి చేష్ట‌ల‌ను గ‌మ‌నించిన చుక్క‌ప‌క్క‌ల వాళ్ళు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డెడ్ బాడీని పోస్టుమార్టంకి త‌ర‌లించారు. త‌మిళ‌నాడు రాష్ట్రం తిరుచ్చిలోని మ‌ణ‌పారైలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

  మేరీ అనే 75 ఏళ్ళ వృద్దురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు జ‌యంతి, జిసిందా అనే ఇద్ద‌రు కూతుళ్ళు ఉన్నారు. త‌ల్లి చ‌నిపోయిన త‌ర్వాత ఆమెకు అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌కుండా ఇంటికి తీసుకెళ్ళారు. త‌మ త‌ల్లి మ‌ళ్ళీ జీవిస్తుంద‌నే అపోహ‌లో ఇంట్లోనే ప్రార్ధ‌న‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇలా రెండురోజుల పాటు త‌ల్లి శ‌వంతో పూజ‌లు చేస్తున్నారు. ఈ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గుర్తించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు… ఆ ఇద్ద‌రు కూతుళ్ళ‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. అయితే వారు విన‌క‌పోవ‌డంతో కాస్త గ‌ట్టిగానే మంద‌లించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ త‌ర్వాత మేరీ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..