హేమ కొరికిన గాయానికి హాస్పిటల్ కి శివబాలాజీ..

  0
  2569

  కుక్కలు, కోతులు ,నక్కలు కరుస్తాయన్న సంగతి వేరే చెప్పక్కర్లేదు.. అయితే మనిషి మనిషిని కరవడం సాధారణంగా మనం వినం.. పిచ్చివాళ్ళు అయితే తప్ప. పిచ్చివాళ్ళు కరిస్తే , వెంటనే చికిత్స చేయాలంటారు. ఇప్పుడు మా ఎన్నికల సందర్భంగా , సీనియర్ కేరెక్టర్ నటి హేమ , హీరో శివబాలాజిని ఎందుకు కరిచిందన్న విషయం పక్కన పెడితే , ఆమె అతడిని కరిచిన తర్వాత , వెంటనే , హాస్పిటల్ కి వెళ్లి టిటి ఇంజెక్షన్ వేయించుకున్నానని చెప్పాడు. ఆమె కరిచినందువల్ల లోతుగా గాటు పడిందని , అందుకే ఎందుకైనా మంచిదని , డాక్టర్ కి ఫోన్ చేస్తే , టిటి ఇంజెక్షన్ వేయించుకోమన్నారని చెప్పారు. మనుషుల పంటి గాట్లు ఒక్కోదఫా ప్రమాదమని , అందులోనూ ఇప్పుడు కరోనా సీజన్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సరిగా బ్రష్ చేయని పళ్లైతే ఇంకా ప్రమాదం . పోలింగ్ కేంద్రంలోకి పోకుండా తనకు చెయ్యి అడ్డంగా పెట్టాడని , అందుకే కొరికానని హేమ చెప్పింది.. మొత్తానికి ఈ కొరుకుడు వ్యవహారం ఇప్పుడు మాఎన్నికల్లో పెద్ద హైలెట్..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..