విజయవాడలో సైబర్ కీచకుడు అరెస్ట్..

    0
    390

    సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధిస్తున్న గణేష్ అనే సైబర్ కీచకుడిని కృష్ణాజిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ నీచుడు ఆంధ్ర ,తెలంగాణలో 19 మంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసి వాళ్లకు నరకం చూపించాడు. గణేష్ తమను వేధిస్తున్నట్లు స్పందన ద్వారా కొంతమంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ప్రత్యేక బృందంతో స్పెషల్ ఆపరేషన్ ద్వారా గణేష్ ను అరెస్ట్ చేశామని ఎస్పీ జాషువా తెలిపారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చి , న్యూడ్ వీడియో కాల్ కు రమ్మని దానిని రికార్డ్ చేసి గణేష్ బ్లాక్ మెయిల్ కు పాల్పడే వాడు.. ఫేస్ బుక్ , ఇంస్టా , ట్విట్టర్లలో అమ్మాయిలకు రిక్వెస్ట్ పంపి , వాళ్ళ అకౌంట్ లో పాగా వేస్తాడు. తరువాత మెల్లగా ముగ్గులోకి దించుతాడు.

    మాయమాటలతో మోసం చేసి , బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు మొదలు పెడతాడు. ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చి , న్యూడ్ వీడియో కాల్ కు రమ్మని దానిని రికార్డ్ చేసి గణేష్ బ్లాక్ మెయిల్ కు పాల్పడతాడు. ఈ విధంగా అమ్మాయిలు వాడివలలో చిక్కి విలవిలలాడిపోయారు. వాడిని పట్టుకోవడానికి ఫిర్యాదు చేసిన బాధిత యువతితో గణేష్ కు ఫోన్ చేయించారు.

    డబ్బులిస్తామని గూడూరు రమ్మని చెప్పి గణేష్ వచ్చినతరువాత పట్టుకున్నారు. గణేష్ ను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దిశ సిఐ నరేష్, ఐటి ఎసై దీపికా, గూడూరు ఎసై వెంకటేష్ ను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించిన జిల్లా ఎస్పీ జాషువా అపరచితుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లు అనుమతించొద్దని చెప్పారు..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.