ఇతడికి ఏకే -47 తుపాకులతో ఇద్దరు గన్ మెన్లు ..

  0
  3538

  తోపుడు బండిమీద బట్టలు అమ్ముకునే ఓ పేద వ్యాపారికి ఏకే -47 తుపాకులతో ఇద్దరు గన్ మెన్లు రక్షణగా ఉన్నారు.. వీధిలో వ్యాపారం చేసుకునే ఈ పేదవాడికి గన్ మెన్ లు ఇవ్వాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలతో , పోలీసులు ఇచ్చారు. అయితే ఈ గన్ మెన్ లు రక్షణ కారణంగా అతడికి వ్యాపారం కూడా సరిగా జరగడంలేదు. అక్కడివరకు వచ్చి , మనకెందుకులే అని చాలామంది తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో గతంలో వెయ్యిరూపాయలు జరిగే వ్యాపారం ఇప్పుడు మూడు వందలకు పడిపోయిందని రామేశ్వర్ దయాల్ అనే ఈ వ్యాపారి వాపోతున్నాడు.

  ఇంతకీ ఈ వ్యాపారికి ఇద్దరు గన్ మెన్ లు రక్షణ ను , అతడు కోరుకోలేదు. కోర్టే ఇచ్చింది. రామేశ్వర్ , తనకున్న రెండున్నర ఎకరాల పొలం , పట్టా కోసం యూపీలోని , ఇటావా జిల్లా సమాజ్ వాది , మాజీ ఎమ్మెల్యే సోదరుడు జగేంద్ర సింగ్ దగ్గరకెళ్ళాడు. ఈ సందర్భంగా జగేంద్ర , రామేశ్వర్ ని , కులం పేరుతొ దూషించి , కొట్టాడు. ఈ విషయమై రామేశ్వర్ కేసుపెట్టాడు. కోర్టులో విచారణ సందర్భంగా , రామేశ్వర్ ని చూసిన న్యాయమూర్తి , నీకు ప్రాణభయం ఉందా అని అడిగాడు. ఉందని చెప్పడంతో , వెంటనే ఇద్దరు గార్డులను ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.