ఇద్దరు పసిపిల్లలకు ఉరివేసి హత్య చేసిన కసాయి తల్లి గతం తవ్వితే ఉన్మాదమే.. ఈ ఘోరం రాజమండ్రి ఆనంద నగర్ లో ఆదివారం రాత్రి జరిగింది. ఆ రక్కసి పేరు పూరేటి లక్ష్మీ అనూష. 13 ఏళ్ల క్రితం తాడేపల్లి గుడి ముక్కు చెందిన రామ్ లక్ష్మణ తో వివాహం అయింది. ఈ ఉన్మాది వేధింపులు భరించలేక భర్త ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి రాజమండ్రి వచ్చి బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఒకవైపు వడ్డీ వ్యాపారాలు నడుపుతోంది. ఏడాది క్రితం రామచంద్రాపురం కి చెందిన జొన్నలగడ్డ రామకృష్ణతో వివాహం అయ్యింది.అతడిని కూడా వదిలేసింది. సీతంపేట కు చెందిన సతీష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తరుచూ పిల్లలను హింస లకు గురి చేస్తుండటంతో పిల్లల్ని కొట్టద్దని అడొచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను గాయపర్చి గూడు విడగొట్టింది. దాంతో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ ఘటనపై లక్ష్మి అనూష సోదరులు వారి మేనమామకు సమాచారం అందించడంతో వారు లక్ష్మీ అనూషను ఫోన్ చేసి మందలించారు. దాంతో ఇద్దరు పిల్లలను ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసి హత్య చేసి అనంతరం ఉరితాడు చాకుతో కోసి పిల్లలు మంచం మీద పడుకోబెట్టి ఆమె ప్రియుడు సతీష్, సోదరులకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫోన్ చేసింది. వారు ఆగమేఘాలపై ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడు తుండగా వారు నిరోధించారు. అనంతరం చనిపోయిన పిల్లల్ని అనుష్కను 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలిసిన త్రీటౌన్ సీఐ మధుబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కసాయి తల్లిని అదుపులోకి తీసుకున్నారు..