మంచు విజయం చిరు పెద్దరికాన్ని సవాల్ చేసిందా.?

  0
  957

  మా అసోసియేషన్ కి జరిగిన ఎన్నికలలో మంచు విష్ణు గెలుపు సినిమా రంగంలో కొన్ని సమీకరణలకు , ఊహాగానాలకు తెరలేపింది. ఈ గెలుపుతోనో , ఓటమితోనో సినిమారంగంలో పెద్ద మార్పులు జరిగిపోతాయని ఎవరూ అనుకోరు.. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా సినిమా రంగంలో ఆధిపత్య పోరు విషయంలో ఎవరిది పైచేయి అన్న విషయమే ఇప్పుడు చర్చనీయాంశం. ఎవరెన్ని చెప్పినా గత కొన్నేళ్లుగా సినిమారంగం , చిరంజీవి కుటుంబం చుట్టూ తిరిగింది. సినిమారంగంలో ఆయన పెద్దరికమే కొనసాగింది. ఆ కుటుంబంలో నలుగురు టాప్ రేంజ్ హీరోలు కావడం , సక్సెస్ విషయంలో వాళ్లకు తిరుగులేకపోవడంతో వాళ్ళ కనుసన్నలలో సినిమా పరిశ్రమ నడిచింది.. ఇష్టంలేని వాళ్ళుకూడా చప్పట్లు కొట్టాల్సి వచ్చింది. ఒక రకంగా చిరంజీవికూడా ఆ హుందాతనాన్ని , పెద్దరికాన్ని కాపాడుకున్నారు. ఈ సమయంలో మా ఎన్నికలొచ్చాయి. చిరంజీవి కుటుంబం తరపునే ప్రకాష్ రాజ్ ప్యానెల్ రెడీ అయింది.. దీనికి నాగబాబు సారధ్యం వహించారు. ఆయనే వివాదాల్లో ఇరుక్కున్నారు. లేనిపోనివి మాట్లాడి , ప్రకాష్ రాజ్ గెలుపే తమ ద్యేయం అన్నట్టు మాట్లాడారు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

  దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. చివరకిది అభ్యర్థుల మధ్య వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. ఒక దశలో పరిస్థితి అసహ్యంగా మారింది. అయితే తెరముండు ఇలా జరుగుతుండగానే , తెర వెనుక ఇది కులం రంగు పులుముకుంది. సినిమా రంగంలో ఒకప్పటి వైభవం మసకబారిన కమ్మ కులం కార్డు తెరమీదకు వచ్చింది. దీంతో ఎన్నికల రంగు , రూపం మారింది. సమీకరణాలు వేగం పుంజుకున్నాయి.. దీనికి తోడు సీనియర్ నటుడైన మోహన్ బాబు కొడుకు కోసం నేరుగా రంగంలో దిగారు. ప్రకాష్ రాజ్ తరపున ఉన్న నాగబాబు స్థాయి సరిపోలేదు. మరో వైపు స్థానిక అంశం , చర్చకు వచ్చింది. ఇంకోవైపు మంచి నటుడని పేరున్న ప్రకాష్ రాజ్ కు , షూటింగ్ టైమింగ్స్ విషయంలో చెడ్డపేరుంది. ఆయన షెడ్యూల్స్ తో ,ఇతర నటులకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తారు. ఇలా అనేక కారణాలతో ప్రకాష్ రాజ్ ఓటమి అనివార్యమైంది.. విష్ణు విజయంతో ఇప్పుడు నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామాచేసి , ఇది తమ వైఫల్యమేనని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..