మొగుడుగా మారిన ప్రియుడి మోసం ..

  0
  2757

  ఐదేళ్ల ప్రేమ , మూడు రోజుల పెళ్లి .. మొగుడుగా మారిన ప్రియుడి మోసం ..అన్నీ కలిసి దగా పడ్డ యువతి ఆక్రందన .. న్యాయంకోసం ఆందోళన . బెంగుళూరు రూరల్ కొని హోస్ కోటే తాలూకా నందగుడిలో ప్రమోద్, అనూజా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రమోద్‌ సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.వీరిద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్నారు.సీఆర్ పి ఎఫ్ క్యాంపస్ లోనే పెళ్లిచేసుకున్నారు. మెడలో మూడు ముళ్ళు వేసి , తాళికి కుంకుమ పెట్టి అన్నీ పద్దతిగానే చేశారు. ఐదేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు పడిందని అనూజా ఆనందంలో మునిగితేలుతుండగా , ప్రమోద్ పెళ్ళైన మూడో రోజే పత్తాలేకుండా పోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు ప్రమోద్ మరో పెళ్ళికి సిద్ధమయ్యాడని అనూజకు సమాచారం అందింది. దీంతో ఆమె నందగుడి పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది..

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??