దోపిడీ ఆసుపత్రులపై ఇక క్రిమినల్ కేసులే..

  0
  16

  క‌రోనా వైద్యానికి ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఇక‌పై అలాంటి ఆస్ప‌త్రుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయ‌మ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు అధిక ఫీజులు వ‌సూలు చేసిన ఆస్ప‌త్రుల‌కు నోటీసులు ఇవ్వ‌డం, ఫైన్లు విధించ‌డం చేస్తున్నారు. ఇక‌పై ఇలాంటి చ‌ర్య‌లు వ‌ద్ద‌ని, నేరుగా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి కోర్టుకు పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు.

  మొద‌టిసారి అధికఫీజులు వ‌సూలు చేసిన‌ట్లు తేలితే ప‌దిరెట్లు పెనాల్టీ విధిస్తారు. మ‌రోసారి ఇదేవిధంగా ఆస్ప‌త్రులు వ్య‌వ‌హ‌రిస్తే క్రిమిన‌ల్ కేసులు పెడ‌తారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ఆక్సీజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. 50 అంత‌కుమించి ప‌డ‌కలు ఉన్న ఆస్ప‌త్రుల్లో త‌ప్ప‌నిస‌రిగా ఆక్సీజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల‌ని ఆదేశించింది. ప్ర‌తి బెడ్ కు ఆక్సీజ‌న్ కాన్స‌న్ ట్రేట‌ర్లు, సిలిండ‌ర్లు ఉండాలే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. 50 బెడ్లు కంటే త‌క్కువ ఉన్న ఆస్ప‌త్రుల్లో కూడా ప్ర‌తి బెడ్ కి ఆక్సీజ‌న్ కాన్స‌న్ ట్రేట్, సిలిండ‌ర్ ఏర్పాటు చేయాల‌న్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..