భార్యను తాకట్టు పెట్టేవు జాగ్రత్త -నారాయణ సంచలన వ్యాఖ్యలు..

  0
  2651

  సీపీఐ నారాయణ మరోసారి నోరు జారారు. అయితే ఈసారి సీఎం జగన్ కుటుంబ సభ్యులను సీన్ లోకి తీసుకు రావడంతో మేటర్ కాస్త హీటెక్కింది. ఏపీకోసం ఎడా పెడా అప్పులు చేస్తున్న జగన్.. అన్నీ తాకట్టు పెడుతున్నారని విమర్శించారు నారాయణ. ఇలాగే అన్నీ తాకట్టు పెట్టుకుంటూ ధర్మరాజులాగా అయ్యేవు జాగ్రత్త అని ఉచిత సలహా పారేశారు. ధర్మరాజు కూడా అన్నీ తాకట్టు పెట్టీ పెట్టీ చివరకు భార్యను కూడా తాకట్టు పెట్టారు. అలాంటి పని చేయొద్దు, ధర్మరాజు పాలన సగం వరకే చేయి అని అన్నారు నారాయణ.

  సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు నారాయణను బూతులు తిడుతున్నారు. కుటుంబ సభ్యుల్ని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారంటూ మండిపడుతున్నారు. నారాయణ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు.

  అయితే నారాయణ మాత్రం తాను అలాంటి మాటలు మాట్లాడలేదని చెబుతున్నారు. వివరణ ఇచ్చుకున్నా.. అప్పటికే ఆలస్యం కావడంతో నారాయణకు మాత్రం తిప్పలు తప్పడంలేదు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..