తుపాన్లు వస్తే పల్లెలు, పట్టణాల్లో అధికారులు సేవా కార్యక్రమాలు ముమ్మరం చేస్తుంటారు. తుపాను సమయంలో అల్ల కల్లోలంగా ఉండే సముద్రంలో నావికా దళం సహాయక చర్యలు చేపడుతుంది. భూమి మీదకు తుపాను వస్తేనే తట్టుకోలేని మనం, తుపాను అయిపోయాక సహాయక చర్యలకు బయలుదేరే అధికార యంత్రాంగం మరోవైపు తుపాను సమయంలోనే సముద్రంలో ఉన్న నావికా దళానికి ఎంత కష్టమో, ఒక్కసారి ఊహించండి. తుపానుకి సంబంధించిన హెచ్చరికలను, తుపాను సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్య్సకారులను వెదుకుతూ వారిని అప్రమత్తం చేసి మళ్లీ తిరిగి తీరానికి పంపించే బాధ్యత నావికా దళానిది. తాజాగా సముద్రం అల్పపీడనంతో అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో ఇలా సాహసానికి సిద్ధమైన నావికా సిబ్బందిని మనం అభినందించాల్సిందే.
IMD predicts cyclonic circulation over Southeast Bay of Bengal & likely formation of a low pressure area around Nov 9,2021
Coast Guard issuing weather warning to fishermen at sea to return to nearest harbour for shelter & against any fishing boat venturing into sea #ChennaiRain pic.twitter.com/i1aGDDzFr3
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) November 7, 2021