ఇక మీదట దురుసుగా లేకుండా చూస్తాం..సారీ

    0
    252

    తెలుగులో ఒకప్పుడు మయూరి చిత్రంలో లీడ్ రోల్ డాన్సర్ పాత్రలో దేశంలో సంచలనం సృష్టించిన సుధా చంద్రన్ కు సిఐఎస్ ఎఫ్ క్షమాపణ చెప్పింది. సుధాచంద్రన్ కు ఒక కాలు లేదు.. ఆమెకు 11 ఏళ్ళ వయసులో , ఒక కారుప్రమాదంలో కాలు తీసేసారు. అయినా నాట్యం మీదున్న మక్కువతో , కృత్రిమ కాలుతోనే ఆమె నాట్యం నేర్చుకున్నారు. ఆమె జీవిత కథ ఆధారంగానే , అప్పట్లో మయూరి చిత్రం వచ్చింది. సినిమాలో ఆమె డాన్స్ చూసినవారికి , ఆమెకు ఒక కాలులేదంటే నమ్మలేరు.

    అప్పటినుంచి ఆమె దేశంలో ప్రముఖ ప్రొఫెషనల్ డాన్సర్లలో ఒకరుగా మిగిలారు. ఇప్పుడు సమస్యఏమిటంటే , ఆమె విమానాల్లో ప్రయాణించే సమయాలలో , ఎయిర్ పోర్టులలో , ఆమె కృత్రిమ కాలు తీసేసి , చెక్ చేస్తున్నారు. దీంతో ఆమె ఇటీవల ఈ విషయంలో తనకు మానవతా దృక్పధంతో మినహాయింపు ఇవ్వాలని కోరింది. ప్రతిసారి ఇలాచేయడంవల్ల , తన అవిటితనాన్ని ఎత్తిచూపినట్టు ఉందని , మహిళగా ప్రతిసారి తాను , తన కాలు తీసి , చూపించి , దాన్ని మళ్ళీ తగిలించుకోవాల్సి వస్తోందని చెప్పింది. ఇటీవల ఎయిర్ పోర్ట్ లో తనకు జరిగిన అవమానం గురించి వివరించింది. దీంతో సిఐఎ ఎఫ్ , ఆమెకు క్షమాపణ చెప్పి , భద్రతా కారణాల దృష్ట్యా , అది తప్పడంలేదని , ఇకమీదట , ఇలాంటి పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామని హామీ ఇచ్చింది..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..