నాకు రైల్లోనే శోభనం . సురేఖకు సిగ్గేసింది.

  0
  15739

  మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇన్నాళ్లూ ఈ విషయం బయట ప్రపంచానికి అస్సలు తెలియదు. అతికొద్దిమందికే తెలిసిన ఈ విషయాన్ని, మెగాస్టార్ ఇప్పుడు బహిరంగంగానే చెప్పేశాడు. తాజాగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న పెళ్ళిసందడి మూవీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టేశాడు. ఎప్పుడూ సీక్రెట్స్ దాచుకోలేని చిరంజీవి ఈసారి .. చాలా రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని కూడా చెప్పేశాడు.

  చిరంజీవికి పెళ్ళైన కొత్తలో ఓసారి ఊటీలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ విచిత్ర సంఘటన జరిగిందట.. అదేమిటంటే.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో షూటింగ్ పూర్తయిన తర్వాత, తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి చెన్నైకి రావాల్సి ఉందట.. ట్రైన్ లో వచ్చేందుకు మూవీ యూనిట్ ఏర్పాట్లు కూడా చేసిందట.. అయితే ట్రైన్ లో ఏర్పాట్లను చూసి చిరంజీవితో పాటూ.. సురేఖ కూడా షాకయ్యారట.. ఎందుకంటే ఆ ట్రైన్లోని ఒక బోగీ మొత్తం శోభన ఏర్పాట్లతో నింపేశాడట దర్శకుడు రాఘవేంద్రరావు. భోగీ మొత్తం ఎటుచూసినా రకరకాల పూలు, స్వీట్లు, అగరబత్తీల పోగలతో రొమాంటిక్ గా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు చిరంజీవి.

  ఈ ఏర్పాట్లను చూసి చిరంజీవితో పాటూ.. ఆయన భార్య సురేఖ కూడా తెగ సిగ్గుపడిపోయిందట.. ఈ వివరాలను మెగాస్టార్ ఏకంగా స్టేజీమీదే చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారుఇలా రాఘవేంద్రరావు చిలిపితనం గురించి బహిరంగంగానే వర్ణించారు మెగాస్టార్ చిరంజీవి.. ఆయనలో ఇంకా చిలిపితనం పోలేదని కూడా చెప్పుకొచ్చారు. ఇంతవయసొచ్చినా, ఆయన మనసు మాత్రం పదహారేళ్ళ వయస్సులోనే ఉండిపోయిందని అన్నారు చిరంజీవి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..