వాడెవరో తరిమేయ్యండి.. గొడవలకు వాడే కారణం.

  0
  8731

  సినిమా రంగంలో వివాదాల‌కు మూల‌కార‌ణం ఓ వ్య‌క్తి ఉన్నాడ‌ని, అత‌డిని ఖ‌చ్చితంగా దూరం పెట్టాల్సిందేన‌ని చిరంజీవి అన్నారు. నిన్న పెళ్ళిసంద‌డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంద‌ర్భంగా చిరు మాట్లాడిన మాటలు… ఆ వ్య‌క్తి ఎవ‌రు అన్న దానిపై అనుమానాల‌కు తావిస్తోంది. ఒక వ్య‌క్తి వ‌ల్ల‌నే ఇవ‌న్నీ వ‌స్తున్నాయ‌ని ఆ వ్య‌క్తిని అంద‌రూ క‌లిసి దూరం పెట్ట‌నిదే చిత్ర‌సీమ బాగుప‌డ‌ద‌ని చిరంజీవి చెప్పారు. వ్యాధి మూలానికి మందు క‌నుక్కోవాల‌ని, హోమియోప‌తి వైద్యం ఇది ప్రాధ‌మిక సూత్ర‌మ‌ని.. ఆ వ్యాధి మూల‌కారానికి మందు వేస్తే త‌ప్ప‌, రోగం న‌యం కాద‌ని గుర్తు చేశారు.

  సినిమా రంగంలో కూడా ఈ వ్యాధికి కార‌కుడైన వ్య‌క్తికి మందు వేసి అత‌నిని దూరంగా పెట్టాల‌ని సూచించారు. హీరోల మ‌ధ్య న‌టుల మ‌ధ్య సుహృద‌భావం ఉండాల‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తిట్టుకోవ‌డం, విమ‌ర్శించుకోవ‌డం స‌హ‌జ‌మేన‌ని, అయితే ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత అంద‌రూ క‌లిసి ఉండాల‌ని వ‌సుదైక కుటుంబంలా క‌లిసిపోవాల‌ని అన్నారు. సినిమా న‌టులు మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌తో ఉండాల‌ని, ఆధిప‌త్యం కోసం కొట్లాడుకోకూడ‌ద‌న్నారు. మ‌న‌లో మ‌నం కొట్టుకుని లోకువ కావొద్ద‌ని, మీడియాకు ఆహారం కావొద్ద‌న్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..