కొండపొలం సినిమా చూసి మెగాస్టార్ ఏమన్నారంటే..?

  0
  209

  క్రిష్, వైష్ణ‌వ్‌ తేజ్ కాంబినేషన్లో వచ్చిన కొండపొలం ఈరోజు విడుదలైంది. ఈ సినిమాను ఒకరోజు ముందే చిరంజీవి చూశారు. ఈ సినిమాను చ‌క్క‌ని సందేశంతో ద‌ర్శ‌కుడు క్రిష్ మంచి ల‌వ్‌ స్టోరీని తెరకెక్కించాడని ప్రశంసించాడు చిరంజీవి. తెలుగు అభిమానుల‌ను అల‌రించేందుకు ఒక అద్భుత‌మైన చిత్రం వ‌స్తుంద‌ని సినిమాపై ప్ర‌శంశ‌ల జ‌ల్లు కురిపించారు మెగాస్టార్. ట్విట్ట‌ర్‌లో కూడా ఈ సినిమా ప్ర‌స్తావ‌న ప్ర‌స్తావించాడు. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, రివార్డులు త‌ప్ప‌కుండా వ‌స్తాయ‌ని వివ‌రించారు.

  “ఈ సినిమా చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాల‌ను ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌ప్ప‌కుండా వీక్షించాలి. ఇందులో ప్ర‌కృతిని కాపాడుకోవ‌డం ప్ర‌తీ ఒక్క‌రి బాధ్య‌తని ఇచ్చిన సందేశంతో పాటు చ‌క్క‌టి ల‌వ్‌స్టోరీ, ఆర్టిస్టుల న‌ట‌న బాగుంది. ప్రేక్ష‌కుల‌ను క‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుందనేది నా న‌మ్మ‌కం. ముందస్తుగా ఈ చిత్ర బృందానికి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను” అని చిరంజీవి ప్ర‌క‌టించారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..