అల్లు అర్జున్ పొలం వెనక అసలు రహస్యం అదే

  0
  2534

  సినీ తారలు, రాజకీయ నాయకులు ఎక్కడైనా పొలాలు, స్థలాలు కొనుగోలు చేయడం కామన్. కానీ వారు ప్రత్యేకంగా ఫలానా చోటే ఎందుకు కొంటారంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. కానీ రియల్ బూమ్ ఎక్కువగా ఉన్నచోటే వారు పొలాలు, స్థలాలు కొంటుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇలాగే రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో రెండెకరాల పొలం కొన్నారు. ఈ పొలం రిజిస్ట్రేషన్ కోసం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం తాసిల్దార్ కార్యాలయానికి వచ్చాడు అల్లు అర్జున్.

  అల్లు అర్జున జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్ కొరకు శంకర్ పల్లి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ అనంతరం తాసిల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు. ఆయన అక్కడికి వచ్చారని తెలుసుకున్న అభిమానులు భారీగా గుమిగూడారు. అల్లు అర్జున్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. తాసిల్దార్ కార్యాలయం అధికారులు సైతం బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇటీవల తారక్ కూడా గోపాలపురంలో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన కెమెరాల కంటికి చిక్కారు. ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకునేందుకు స్టైలిష్ స్టార్ పొలం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..