తమిళులు , ఆమ్మో ఎంత తెలివైనోళ్లు.. కార్లను అలా భద్రంచేసారు..

  0
  29813

  త‌మిళ తంబీల తెలివే తెలివి. వాళ్ళ తెలివికి సెల్యూట్ చేయాల్సిందే. ఇంత‌కీ అదేంటంటారా ? అక్క‌డికే వ‌స్తున్నా. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో కురిసిన భారీ వ‌ర్షాల‌కు బైకులు, కార్లు కొట్టుకుపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు త‌మిళ‌నాడును ముంచెత్తుతున్నాయి. గ‌త‌ రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానకు చెన్నై నీట మునిగింది. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపై నీరే. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బస్సులు అరకొరగా తిరుగుతుండగా, లోకల్ రైళ్లను నిలిపివేశారు. భారీవ‌ర్షాల‌తో ప్ర‌భుత్వం రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించింది. ఇదిలావుంటే, గ‌తంలో లాగా కార్లు కొట్టుకుపోతాయ‌నే ఉద్దేశ్యంతో త‌మిళ తంబీలు కొత్త ఐడియా వేశారు. కారు య‌జ‌మానులంతా త‌మ కార్ల‌ను తీసుకెళ్ళి ఫ్లై ఓవ‌ర్ల మీద పార్కింగ్ చేసేశారు. ఇప్పుడు వ‌ర్షం కురిసినా, వ‌ర‌ద‌లు వ‌చ్చినా, నీరు ఫ్లైఓవ‌ర మీద‌కు రాద‌నే ఉద్దేశ్యం వాళ్ళ‌ది. అందుకే కార్లు ఉన్న య‌జ‌మానులంతా త‌మ కార్లను ఎక్క‌డ ఫ్లై ఓవ‌ర్ క‌నిపిస్తే అక్క‌డ పార్క్ చేసేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..