తప్పు చేసిన డిజిపి అంటే భయమా,??

    0
    124

    స్పెషల్ డీజీపీ హోదాలో ఉన్న ఆఫీసర్లను సస్పెండ్ చేసేందుకు మీకు భయమెందుకు..? అంటూ మద్రాస్ హైకోర్టు, తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒక ఐపీఎస్ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్పెషల్ డీజీపీ స్థాయి అధికారిని, విచారణ పేరుతో ఎందుకు వదిలిపెడుతున్నారని నిలదీసింది. చిన్న తప్పులు ఉన్నా, కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసే ప్రభుత్వాలు, స్పెషల్ డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేయకూడదనే నిబంధన ఏమైనా ఉందా అని నిలదీశారు. తప్పు చేస్తే, స్పెషల్ డీజీపీ అయినా, కానిస్టేబుల్ అయినా ఒకటేనని అన్నారు. ఈ విషయమై తమకు సమగ్రమైన నివేదిక అందించాలంటూ జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఆదేశించారు.

    స్పెషల్ డీజీపీ అంటే అంత శక్తిమంతుడా,??

    స్పెషల్ డీజీపీ అంటే అంత శక్తిమంతుడా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన్ను సస్పెండ్ చేసే శక్తి ఉండదా అంటూ నిలదీశారు. ఎస్పీ స్థాయిలో ఉన్న ఒక మహిళా అధికారి, తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ డీజీపీ స్థాయి అధికారిపై చేసిన ఆరోపణలను కోర్టు, తనంతట తానుగా విచారణకు తీసుకుంది. ఈ విషయంలో జరుగుతున్న విచారణ నివేదికను మార్చి 16లోపు తమ ముందుంచాలని కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??