ఆన్ లైన్ గేమ్స్ పిచ్చిలో ఎంత ఘోరం ..?

  0
  962

  బంగారంలాంటి ఉద్యోగం.. భార్యాపిల్లలల్తో పచ్చటి కాపురం .. అయినా ఆన్ లైన్ గేమ్స్ పిచ్చిలో ఆ ఐటి ఇంజినీర్ ఉన్మాదిగా మారాడు.. ఆన్ లైన్ గేమ్స్ కోసం లక్షలు అప్పుచేశాడు.. తీర్చే దారిలేక , సంసారం ఈదలేక , భార్యాబిడ్డలను చంపేసి , తానూ ఆత్మహత్యచేసుకున్నాడు.. చెన్నై పెరుంగుడిలో జరిగిందీ దారుణం.. మణికందన్ అనే ఇంజినీర్ కు ఇద్దరుపిల్లలు.. భార్య ప్రియ, పిల్లలు ధరన్‌(10), దహన్‌(01) . ఆన్ లైన్ గేమ్స్ పిచ్చిలో రెండేళ్ల క్రితం అప్పులపాలయ్యాడు . వాటిని తీర్చేందుకు , తెలిసిన వాళ్ళు అందరివద్దా అప్పులు చేసాడు..

  అప్పులు పెరిగిపోతున్నా , ఆన్ లైన్ గేమ్స్ పిచ్చి మానలేదు. దీంతో అప్పులు ఇచ్చిన వారి వత్తిళ్లు ఎక్కువయ్యాయి.. మణికంధన్ ఉన్మాదిలా మారిపోయాడు. భార్యని క్రికెట్ బ్యాట్ తో తలపగలకొట్టి చంపేశాడు. నిద్రపోతున్న పిల్లల ముఖంపై దిండు అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. చివరలో తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆన్ లైన్ గేమ్స్ పిచ్చి చివరకు ఇలా ఒక పండంటి కాపురాన్ని బలితీసుకుంది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..