ఆ బ్యాంకు మేనేజర్ చేసిన పనికి కోటి దండాలు..

  0
  471

  ఓ బ్యాంక్ మేనేజర్ ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకున్నాడు. బోరున కురుస్తున్న వర్షంలో ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన అంబులెన్స్ కు .. స‌రైన స‌మ‌యంలో ట్రాఫిక్ క్లియ‌ర్ చేసి, ఆస్ప‌త్రికి చేర్చ‌గ‌లిగాడు. ఇందుకోసం నాలుగు కి.మీ దూరం ప‌రిగెత్త‌డం విశేషం. నిత్యం రద్దీగా ఉండే మెట్రో పాలిటిన్ సిటీ చెన్న‌య్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  చెన్నైలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అదే స‌మ‌యంలో బోరున కురుస్తున్న వర్షంలో ఓ బ్యాంక్ మేనేజ‌ర్ ఆ దారిలో త‌న కారులో వెళుతున్నాడు. అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవ‌డాన్ని గుర్తించాడు. అందులో ఉన్న వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్న ఓ బ్యాంక్ ఉద్యోగి.. తానే రంగంలోకి దిగాడు. త‌న కారును ప‌క్క‌కు పార్క్ చేసి, రోడ్డుపై వాహనాలను పక్కకు తప్పిస్తూ అంబులెన్సుకు లైన్ క్లియర్ చేశాడు. అలా దాదాపు 4కి.మీ వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. అంబులెన్స్ ఆస్ప‌త్రి చేరేవ‌ర‌కు ఆయ‌న త‌న ప‌రుగు ఆప‌లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఆ బ్యాంక్ మేనేజ‌ర్‌ పడ్డ తపన ప్రతీ ఒక్కరినీ కదిలించింది. బ్యాంక్ ఉద్యోగి స‌మ‌య‌స్ఫూర్తి, సాహ‌సంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..