పోలీస్ కస్టడీలో హాయిగా నవ్వుకుంటూ..

  0
  1325

  డ్రగ్స్ కేసులో అరెస్టై పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు ఎలా ఉంటారు.. దిగాలుగా, భవిష్యత్తుపై బెంగతో ఉంటారు. కానీ బాలీవుడ్ బాద్ షా కొడుకు ఆర్యన్ ఖాన్ మాత్రం హాయిగా నవ్వుతూ ఉన్నాడు. పోలీసుల కస్టడీలో ఓ కారులో వెళ్తున్న ఆర్యన్ ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. పోలీసులు చుట్టూ ఉన్నా తనకేం కాదు అనే ధైర్యంతోనే ఆర్యన్ అలా నవ్వుతున్నాడని, తన తండ్రి షారుఖ్ ఖాన్ తనని ఈజీగా బయటపడేస్తాడనే నమ్మకం ఆ కుర్రాడికి ఉందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

  డ్రగ్స్ మత్తు కారణమా..?
  మరికొందరు మాత్రం పోలీస్ కస్టడీ సమయానికి ఆర్యన్ ఇంకా డ్రగ్స్ మత్తులోనే ఉన్నారని, అందుకే అలా పిచ్చిపిచ్చిగా నవ్వుతున్నాడని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఫైనల్ గా భారత్ లో చట్టాలన్నీ కేవలం కామన్ మ్యాన్ కోసమేనని, ఇలాంటి వారందరికీ ఎలాంటి ఢోకా లేదని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఉదంతాన్ని కూడా ఉదాహరణగా చెబుతున్నారు. జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటపడ్డారని, రేపు ఆర్యన్ ఖాన్ కూడా డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా బయటకొస్తాడని అంటున్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..