నడిరోడ్డుపై కారు బీభత్సం.. ఎలా జరిగిందో ఊహించలేం..

  0
  1745

  ప్రమాదాలు ఒక్కోసారి చాలా దారుణంగా ఉంటాయి, చూసేందుకే భయానకంగా ఉంటాయి. రోడ్డు డివైడర్ కు అటువైపు పోతున్న కారు, డివైడర్ ని ఢీకొట్టి రోడ్డుకి మరో వైపు పోతున్న ఆటోను, మోటర్ సైకిల్ ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దారుణం ఏంటంటే కారు.. మోటర్ సైకిల్ ని పూర్తిగా తొక్కించేసి, వెనక చక్రాలు మోటర్ సైకిల్ పై నిలబడిపోయాయి.

  తెలంగాణలోని మేడ్చల్ రేకుల బావి వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న తల్లీ కూతుళ్లు చనిపోగా, బైక్ పై వస్తున్న సుధీర్ వర్మ కూడా చనిపోయాడు. మరో మూడేళ్ల బిడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు అక్కడినుంచి పారిపోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని, ఆ వేగం వల్ల కారుని కంట్రోల్ చేయలేక ఆవైపు డివైడర్ ని కొట్టి, ఈవైపుకి వచ్చి ఈ బీభత్సం సృష్టించారని చెబుతున్నారు.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్