మేకప్ వేసుకొని మోసం చేసింది..విడాకులిప్పించండి.

  0
  1178

  మేక‌ప్ ఎంత ప‌ని చేసింది ?డైవ‌ర్స్ వ‌ర‌కు తీసుకెళ్ళిందంటే న‌మ్మ‌గ‌ల‌రా ?
  పెళ్ళి కోసం ఒక‌రికొక‌రు ఫోటోలు పంపుకున్నారు. ఫోటోలో న‌చ్చ‌డంతో పెళ్ళిచూపులు కానిచ్చారు. పెళ్ళిచూపుల్లోనూ ఒక‌రికొక‌రు న‌చ్చారు. ఇంకేముందు చ‌క్క‌గా ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. సీన్ క‌ట్ చేస్తే, మ‌రుస‌టి రోజే పెళ్ళికొడుకు డైవ‌ర్స్ కి అప్ల‌య్ చేశాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందో తెలుసా ? దీనికి కార‌ణం ఏంటో తెలుసా ? మేక‌ప్… జ‌స్ట్ మేక‌ప్‌..

  పెళ్ళి కోసం పంపిన వ‌ధువు మేక‌ప్ లో ఉన్న ఫోటో పెట్టింది. ఫోటోలో న‌చ్చ‌డంతో, వ‌రుడు పెళ్ళిచూపుల‌కు వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలోనూ వ‌ధువు మేక‌ప్ లోనే ఉంది. ఇంక అబ్బాయికి పిచ్చ‌గా న‌చ్చేసింది. వెంట‌నే పెళ్ళికి ముహూర్తం పెట్టించి, ఎంచ‌క్కా పెళ్ళి చేసుకున్నాడు. అంద‌మైన భార్య దొరికింద‌ని ముచ్చ‌ట‌ప‌డిపోయాడు. అందాల మోహంలో ఊయ‌లూగాడు. అయితే మ‌రుస‌టి రోజు త‌న గ‌దిలో ఉన్న అమ్మాయిని చూసి ఖంగుతిన్నాడు. ఎవ‌రా అని ప‌రిశీల‌న‌గా చూస్తే, అక్క‌డ ఉన్న‌ది త‌న భార్యే అని అర్ధం చేసుకున్నాడు. ఇలా ఉన్నావేంటి అని అడిగే స‌రికి, వ‌ధువు నేను ఇలాగే ఉంటాను, నా అస‌లు రూపం ఇదే అని బ‌దులిచ్చింది. అయితే మేక‌ప్ తో న‌న్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నావా అంటూ వ‌రుడు డైవ‌ర్స్ కోసం అప్ల‌య్ చేశాడు త‌న‌ను మేక‌ప్ తో ఏమార్చి పెళ్ళి చేసుకుంద‌ని ఆరోపిస్తూ, భార్య‌తో విడాకులు ఇప్పించాల‌ని కోర్టు మెట్లెక్కాడు. ఈజిప్టులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..