బాత్రూం గీజర్ లో గ్యాస్ లీకై దారుణం..

  0
  214

  బాత్రూమ్ లో గ్యాస్ గీజర్ ప్రాణాంతకమైంది.. కరెంట్ ఖర్చు తగ్గుతుందని గ్యాసుగీజర్ పెట్టుకున్న ఓ కుటుంబంలో 27 ఏళ్ళ యువతి గీజర్ లో గ్యాస్ లీకై చనిపోయింది. ఆ యువతికి మూడు రోజుల క్రితమే పెళ్లయింది. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఈ దారుణం జరిగింది. నిధిగుప్త అనే యువతి బ్యాంకు లో పనిచేస్తోంది.

  పెళ్ళై మూడు రోజులైంది. ఉదయాన్నే స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కురుమ సభ్యులు బాత్రూం తలుపు పగలకొట్టి చూడగా చనిపోయిఉంది. బాత్రూంలో గ్యాస్ లీకై ఉంది. బాత్రూం కి వెంటిలేషన్ కూడా లేదు.

  దీంతో లీకైన గ్యాస్ బయటకు పోయే అవకాశం లేదు. గీజర్ నుంచి కార్బన్ మోనాక్సయిడ్ గ్యాస్ లీకైందని , దీనివల్ల ఆమె శరీరంలో ఆక్సిజెన్ స్టాయితగ్గి , స్పృహ కోల్పోయి , తర్వాత కోమా స్థితికి చేరి చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక తెలిపింది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..