అతడు రాలేదని పీటలమీద పెళ్లి ఆపేసింది..

  0
  283

  పీటల మీద పెళ్లి ఆపేసిన పెళ్లి కూతురు..
  కారణం తెలిస్తే నిజంగానే షాకవుతారు..
  =================
  పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు మాత్రమే కాదు.. ఒకరిపై ఒకరికి నమ్మకం.. ఏది ఏమైనా జీవితాంతం తోడుంటానని చేసే ప్రమాణం.. అయితే పెళ్లినాడు చేసే ఈ ప్రమాణం నేటిరోజుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు.. చిన్నచిన్న విషయాలకే విడిపోతున్నారు. సింపుల్ గా విడాకులు ఇచ్చేసి.. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా మారిపోయి.. అమ్మాయిలు మరీ స్పీడ్ అయిపోతున్నారు. పెళ్లయ్యేవరకూ కూడా ఆగకుండా పీటలమీదనే పెళ్లిళ్లు వద్దని చెప్పేస్తున్నారు. చిన్నచిన్నకారణాలతో పెళ్ళని రద్దు చేసుకుంటున్నారు.

  తాజాగా యాపీలోని కాన్పూర్ లో పీటల మీద పెళ్లి నిలిచిపోయింది. అయితే ఏదో పెద్ద కారణంతో పెళ్లి క్యాన్సిల్ అయిందనుకుంటే మీరు పొరబడినట్టే.. ఎందుకంటే ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం పెళ్ళికొడుకు..పెళ్లికూతురు కాదు.. వారిరువురి బంధువులు, స్నేహితులు అంతకన్నా కాదు.

  అప్పటి వరకూ పెళ్లిమండపం సందడిగా కనిపించింది. అబ్బాయి ఊరేగింపుతో మండపానికి చేరుకున్నాడు. అమ్మాయి కూడా తాళికట్టించుకునేందుకు సిద్ధంగా ఉంది.
  ఎందుకో అమ్మాయి తలెత్తి అటూఇటూ చూడసాగింది. అంతే కోపంతో పీటలపై నుంచి లేచి నాకు ఈ పెళ్లి వద్దంటూ వేదిక దిగేసింది. ఇంతకీ పెళ్లి ఎందుకు వద్దన్నావని అడిగితే.. ఫోటోగ్రాఫర్ ఎక్కడ అని ప్రశ్నించింది. కనీసం పెళ్ళికి ఫోటోలు, వీడియోలు కూడా లేకపోవడంపై ప్రశ్నించింది. పెళ్లి వేడుకనే సరిగ్గా నిర్వహించలేని మొగుడు.. తనకొద్దంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇక చేసేదేమీ లేకపోవడంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని అక్కడి నుంచి ఎవరిదారిన వారు ఇళ్లకు వెళ్లిపోయారు.

  ఈ మొత్తం కధలో ట్విస్ట్ ఏంటంటే.. ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ కు మధ్యన గొడవల కారణంగానే వారిద్దరూ ఈ పెళ్ళికి హాజరుకాలేదట..
  పాపం.. వాళ్ళ తప్పుకి పెళ్ళికొడుకు బాధపడాల్సి రావడం నిజంగా విడ్డూరమే..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..