ఏడో అడుగులో పెళ్ళికొడుకుని వద్దంది..

    0
    338

    కాలం మారింది. కాలంతో పాటు పెళ్ళిళ్ళు మారిపోయాయి. అంత‌కంటే ముందు.. వ‌ధూవ‌రులూ మారిపోయారు. ఎంత‌లా అంటే… పెళ్ళికి ముందు లేచిపోయేవారు, పెళ్ళి త‌ర్వాత వెళ్ళిపోయేవారు కొంద‌రైతే… పెళ్ళి పీట‌ల మీద నుంచి పారిపోయేవారు, పెళ్ళి తంతు జ‌రుగుతున్న‌ప్పుడు వ‌ద్ద‌నేవారు మ‌రికొంద‌రు. ఈ పెళ్ళి కూడా అలాంటిదే. కానీ కొంచెం స్పెష‌ల్. ఎందుకంటే… పెళ్ళికూతురు తాళి క‌ట్టించుకుని.. ఏడు అడుగులు న‌డిచే స‌మ‌యంలో పెళ్ళి వ‌ద్దంటూ పేచీ పెట్ట‌డ‌మే ఇక్క‌డ స్పెష‌ల్.
    వివ‌రాల్లోకి వెళితే…

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఇటావా జిల్లా భ‌ర్తానాటౌన్‌లో నీతాయాద‌వ్ అనే అమ్మాయితో ర‌వియాద‌వ్‌కు పెళ్ళి నిశ్చ‌య‌మైంది. పెళ్ళికి కావాల్సిన సరంజామా కొనేసుకుని, గిఫ్టులు అవీఇవీ అన్నీ వ‌ధూవ‌రుల త‌ల్లిదండ్రులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక పెళ్ళి స‌మ‌యం రానే వ‌చ్చేసింది. పెళ్ళి మండ‌పంలో వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ కూర్చుకున్నారు. పెళ్ళి కొడుకు వేద‌మంత్రాల సాక్షిగా బంధు స‌మ‌క్షంలో అంద‌రి ముందు వ‌ధువు మెడ‌లో వ‌ర‌మాల వేసి, తాళి కూడా క‌ట్టేశాడు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. ఇక ఏడు అడుగులు న‌డిచే స‌మ‌యంలో పెళ్ళికూతురు అడ్డం తిరిగింది. ఆరు అడుగులు పెళ్ళికొడుకు వెన‌క వేసిందో లేదో.. ఏడో అడుగు వేసే స‌మ‌యంలో కాలు క‌ద‌ప‌లేదు. మెడ‌లోని వ‌ర‌మాల తీసి విసిరేసి.. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదంటూ గొడ‌వ చేసింది. ఎంత‌మంది న‌చ్చ‌చెప్పినా విన‌లేదు స‌రిక‌దా…నానా హంగామా చేసింది. కార‌ణం ఏమిట‌ని అడిగితే .. దిమ్మ‌తిర‌గే స‌మాధానం ఇచ్చింది.

    పెళ్లికి ముందు అబ్బాయి ఫోటో పంపిన‌ప్పుడు అందంగా క‌నిపించిన పెళ్ళికొడుకు.. నేరుగా చూస్తే.. ఫోటోలో ఉన్న‌ట్లు లేడని, అందుకే త‌న‌కు ఈ పెళ్ళి ఇష్టం లేదంటూ మొండికేసింది. ఆ ఫోటోలో ఉన్న‌ది తానేన‌ని పెళ్ళికొడుకు చెప్పినా.. వ‌రుడి కుటుంబ‌స‌భ్యులు చెప్పినా.. వ‌ధువు మాత్రం పెళ్ళికి స‌సేమిరా అంది. దీంతో తాము ఇచ్చిన కానుక‌లు తిరిగి ఇచ్చేయాల‌ని వ‌రుడి కుటుంబీలు అడిగినా.. అందుకు నిరాక‌రించారు అమ్మాయి త‌ర‌పు బంధువులు. దీంతో ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేష‌న్ కు చేరింది.

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.