ఇదేమిటి..? ఈ వయసులో అన్నప్రాసన.. ? నిజమే.

  0
  444

  15 ఏళ్ళ బాలుడికి అన్నప్రాసన.. ఈ మాట వింటే ఎవరూ నమ్మరు.. 15 ఏళ్ళ వరకూ ఆ బాలుడు అన్నం తినలేదుకాబట్టి , ఇపుడు వాడికి అన్నం తినిపించి అన్నప్రాసన చేశారు.. ఈ విచిత్రం విదేశాల్లో కాదు.. మన రాష్ట్రంలోనే.. కర్నూల్ ఓల్డ్ టౌన్ లో సాబీర్ కొడుకు తన్వీర్ , 10 వ తరగతి చదువుతున్నాడు.. చిన్నప్పటినుంచీ అన్నం అంటేనే వాంతి చేసుకునేవాడు.. బన్ను , బ్రేడ్ , రోటి ఇవే తింటాడు. అన్నం పెట్టాలని ప్రయత్నంచేసినా వాంతిచేసుకుంటాడు.. దీంతో ఆ బాలుడి జీవితం ఇప్పటివరకు అలాగే సాగింది. అయితే బాలుడి మేనత్త , మాత్రం తన్వీర్ కి అన్నం తినిపించాలని పట్టుబట్టింది. జీవన అనే సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుపోయింది. కొంతకాలం కౌన్సిలింగ్ తర్వాత , నిదానంగా అన్నం తినిపించారు. మొదట వాంతులుచేసుకున్నా , తరువాత అలవాటైంది.. దీంతో బంధువులు , తన్వీర్ కి ఇప్పుడు అన్నప్రాసన చేసి , సంబరం చేసుకున్నారు..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..