BMW స్కూటర్ వచ్చేసింది.. రేటెంతో తెలిస్తే బేజారే..

    0
    1382

    బీఎండబ్ల్యూ తాజాగా భారత మార్కెట్లోకి C-400 GT మ్యాక్సీ స్కూటర్ ను తీసుకువచ్చింది. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్ లో విక్రయిస్తారు. నేటి నుంచే బుకింగులు మొద‌ల‌య్యాయి. కంఫర్ట్, డైనమిక్ పెర్ఫార్మెన్స్, లాంగ్ డ్రైవ్ లకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఎక్స్ షోరూమ్ ధర రూ.9.95 లక్షలు అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులోనే స్ట‌యిల్ ట్రిపుల్ బ్లాక్ మోడల్ ఖరీదు రూ.10.15 లక్షలు అని తెలిపాయి.

    ఈ స్కూట‌ర్ లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ వాటర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. 7,500 RPM వద్ద 33.5 BHP శక్తిని విడుదల చేస్తుంది. 9.5 సెకన్లలోనే 0 నుంచి 100 k.m వేగం అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 139 km. డిజిటల్ కన్సోల్, ట్విన్ ఎల్ఈడీ హెడ్ లైట్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, హై విండ్ షీల్డ్, టీఎఫ్ టీ స్క్రీన్ సహిత ఫంక్షన్ క్లస్టర్ ఈ మ్యాక్సీ సూటర్ లో ఆకర్షణీయమైన ఫీచర్లు అమ‌ర్చారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..