కానిస్టేబుల్ కి చెంప ఛెళ్లుమనిపించాడు.

  0
  303

  బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కర్నాటకలో కానిస్టేబుల్ కి చెంప ఛెళ్లుమనిపించాడు. అధికార పార్టీ నేత కాబట్టి పోలీస్ శాఖ కూడా సర్దుబాటు చేసుకుంది. రాయచూర్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధరామయ్య అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆయన దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. నడిరోడ్డులో ఇలా చేయడం మంచిది కాదంటూ కానిస్టేబుల్ బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పాపా రెడ్డిని అడ్డుకున్నాడు. తనకు అడ్డం వచ్చాడన్న కోపంతో పాపారెడ్డి ఆ కానిస్టేబుల్ ను ఈడ్చి చెంపపై కొట్టాడు. అంతలో పక్కనే ఉన్న పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ ని అక్కడినుంచి పంపించి వేశారు. మరికొంతమంది కానిస్టేబుళ్లు తిరగబడి నిరసన వ్యక్తం చేస్తున్నా.. దిష్టిబొమ్మ దగ్దం చేసే కార్యక్రమాన్ని ఆపలేకపోయారు. సాటి కానిస్టేబుల్ పై పాపారెడ్డి చేసిన దౌర్జన్యానికి కేసు పెట్టాల్సిందేనని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..