బ్లాక్ ఫంగస్ కి కళ్ళు , ముక్కు తీసేశారు..

    0
    151

    ఒక‌వైపు దేశంలో క‌రోనా కోర‌లు చాచి మ‌హావిల‌యం సృష్టిస్తుంటే మ‌రోవైపు బ్లాక్ ఫంగ‌స్ ర‌క్క‌సి భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తోంది. దేశంలోని 8 రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌య్యారు. ఇప్పుడిప్పుడే వాటి సంఖ్య పెరుగుతోంది. దేశంలో బ్లాక్ ఫంగ‌స్ తో మృతి చెందిన తొలి కేసు ఉత్త‌రాఖండ్ లో న‌మోదైంది. రిషికేష్ లోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో ఓ పేషంట్ బ్లాక్ ఫంగ‌స్ తో చ‌నిపోయాడు. ఇదే ఆస్ప‌త్రిలో కోవిడ్ రోగులుగా ఉన్న వారిలో 19 మందికి బ్లాక్ ఫంగ‌స్ సోకింది. డెహ్రాడూన్ నుంచి వ‌చ్చిన 36 ఏళ్ళ వ్య‌క్తికి ఆపరేష‌న్ చేయాల్సివుంద‌ని, అయితే బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి సోక‌డంతో ఆప‌రేష‌న్ కి వీలుకాక‌, అత‌ను చ‌నిపోయాడ‌ని ఎయిడ్స్ డైరెక్ట‌ర్ ర‌వికాంత్ తెలిపారు.

    19 మంది బ్లాక్ ఫంగ‌స్ రోగుల్లో 11 మంది ఉత్త‌రాఖండ్ చెందిన వారుకాగా, 8 మంది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కి చెందిన వార‌ని తెలిపారు. బ్లాక్ ఫంగ‌స్ సోకిన వారిలో 13 మంది రోగులు గ‌తంలో ఏదో ఒక ఆప‌రేష‌న్ చేయించుకున్న వారేన‌ని తెలిపారు. బ్లాక్ ఫంగ‌స్ సోకిన మ‌రో ఇద్ద‌రు పేషంట్ల‌కు క‌ళ్ళు తీసేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. 11 మందికి ముక్కులోని దూలం తొల‌గించాల్సి వ‌చ్చింద‌న్నారు. వాళ్ళంద‌రికీ ముక్కులో ఫంగ‌స్, వ్య‌ర్ధ క‌ణ‌జాలం ఉండిపోయింద‌న్నారు. బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని ర‌వికాంత్ వెల్ల‌డించారు.

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.