కూలిన హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్ చిక్కింది.

  0
  5440

  భారత ఆర్మీ హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న విషయం మరికొద్ది రోజుల్లో వెలుగులోకి వస్తుంది. డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర రక్షణ రంగ ఉద్యోగులు మొత్తం 13మంది ఈ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. తమిళనాడులోని కున్నూర్ ప్రాంతంలో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదం MI17-V5 యుద్ధ హెలికాప్టర్ పనితీరుని ప్రశ్నించేదిగా ఉంది. రష్యాకు చెందిన ఈ హెలికాప్టర్ తయారు చేసిన కంపెనీ కూడా ఇప్పుడు ఈ ప్రమాదంపై దృష్టిపెట్టింది.

  ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ ని రికవరీ చేసుకున్నారు. ఈ బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేస్తే, ప్రమాదం ఎలా జరిగింది. చివరి క్షణంలో హెలికాప్టర్ లో ఏం జరిగింది. రాడార్ కేంద్రానికి పంపిన సంకేతాలేంటి..? పైలెట్ చివరి సారిగా ఏం చేశాడు..? ఇంజిన్లో ఎలాంటి లోపం ఉందన్న విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేసి కనుక్కొంటారు. కొన్ని ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ రికవరీ చేసే అవకాశం ఉండదు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదంలో మాత్రం బ్లాక్ బాక్స్ చాలా భద్రంగా ఉందని తెలుస్తోంది.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.