ఇద్దరు పేదపిల్లల పేరుమీద 960 కోట్లు..

    0
    929

    పేదపిల్లలకు యూనిఫారం కొనుగోలు పధకం ఒకటి బీహార్ రాష్ట్రంలో అమలులో ఉంది.. ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం బ్యాంకులో వేసిన డబ్బులు కోసం డబ్బులు కోసం తల్లితండ్రులు బ్యాంకు పోవాలని బ్యాంకు పాస్ బుక్ చూసారు. అందులో ఒకడి పేరుమీద తొమ్మిది వందల కోట్లు , మరొకడి పేరుమీద 60 కోట్లు డిపాజిట్ అయినట్టు ఉంది.. గురుచంద్ర విశ్వాస్ , అజిత్ అనే ఇద్దరు పిల్లల మీద 960 కోట్లు డబ్బులు డిపాజిట్ అయినట్టు బ్యాంకు అధికారులుకూడా చూసి మతులు పోగోట్టుకున్నారు. దీంతో పైఅధికారులకు విషయం తెలియజేసారు. కటిహర్ జిల్లాలోని బంగావురా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర గ్రామీణ బ్యాంకులో ఈ డిపాజిట్లు ఉన్నట్టు రికార్డులు చూపుతున్నాయి. ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. వారం క్రితమే బీహార్ లోనే రంజిత్ దాస్ అనే వ్యక్తి , తన బ్యాంకు ఖాతాలో పొరపాటుగా పడ్డ ఐదున్నర లక్షల రూపాయలు వాడుకొని , తిరిగి కట్టమంటే , అవి తమకు ప్రధానిమంత్రి మోడీ పంపిన డబ్బులని చెప్పి , కట్టేందుకు నిరాకరించడంతో , బ్యాంకు అధికారులు కేసుపెట్టారు..

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్