అఖండ పాకిస్తాన్ లో అదరకొట్టింది.. బాలయ్య చెప్పింది ఇది .

  0
  78

  పాకిస్థాన్ లోనూ జై బాలయ్య..
  ఏపీలో మాత్రం వినేవాడే లేడన్న బాలయ్య..
  ========================
  నందమూరి బాలయ్య అఖండ మూవీతో తన స్టామినా ఏమిటో అందరికీ చూపిస్తున్నారు. అఖండ మూవీ భారీ విజయం సాధించడంతో మూవీ టీం పార్టీల మీద పార్టీలు చేసుకుంటోంది. తాజాగా అఖండ మూవీ సంక్రాంతి సంబరాలు కూడా చేసుకుంది. ఈ ఫంక్షన్ లో బాలయ్య తనదైన శైలిలో మాట్లాడుతూ అభిమానులను అలరించారు.

  అఖండ మూవీ పాకిస్థాన్ లోనూ ఘన విజయం సాధించిందని అన్నారు బాలయ్య. పాక్ లో ఎక్కడ చూసినా అఖండ గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. పాక్ నుంచి వాట్సాప్ వీడియో కాల్స్ కూడా తనకు వస్తున్నాయని అన్నారు బాలయ్య. తన అఖండ మూవీ పాన్ ఇండియా స్థాయి దాటేసి.. పాన్ వరల్డ్ గా అవతరించిందని చెప్పుకొచ్చారు. కరోనా రోజుల్లో అందరూ సినిమాలు విడుదల చేసేందుకు భయపడుతుంటే.. తమ బృందం మాత్రం ధైర్యంగా సినిమాను విడుదల చేసిందని చెప్పారు. అనుకున్నట్టుగానే అఖండకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారని అన్నారు బాలయ్య. ఇక ఏపీలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదం గురించి ప్రస్తావించగా.. ఏపీలో టికెట్ల రేట్ల గురించి మాట్లాడితే, వినే వాడే లేడని పంచులేశారు బాలయ్య.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..