చంద్రబాబు అండ్ జగన్ ప్రొడక్షన్స్ సినిమా ..

  0
  208

  రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు అండ్ జగన్ ప్రొడక్షన్స్ సినిమా బాగా రక్తికట్టింది. ఒకరికి మించి మరొకరు పాత సినిమాల్లో ఎస్వీ రంగారావు, గుమ్మడి లాగా పోటీ పడి నటించారు. అయితే వీరిద్దరిలో ఎవరి నటన పండింది అనే విషయం ప్రేక్షకులకే వదిలేద్దాం.

  ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం, కొవిడ్ టైమ్ లో రోడ్ల కూడలిలో ధర్నాలకు అనుమతి ఉండదని చంద్రబాబుకి తెలుసు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత తనను బయటకు పోనివ్వరని కూడా తెలుసు. ఈ విషయం తెలిసే, చిత్తూరు చుట్టుపక్కల జిల్లాల తెలుగు దేశం నాయకులకు సమాచారం ఇచ్చి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు రమ్మన్నారు.

  ధర్నాకు కూర్చుంటానని చంద్రబాబుకి తెలుసు.

  =====================

  తనను ఎయిర్ పోర్ట్ లోనే నిర్బంధిస్తారని, అలా చేస్తే, తాను అక్కడే ధర్నాకు కూర్చుంటానని చంద్రబాబుకి తెలుసు. అందుకనే ముందుగానే ఆయన తన ఆహారం మెనూ ని సిద్ధం చేసుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో బైఠాయించడం ద్వారా పంచాయతీ ఎన్నికల్లో, మరియు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో అక్రమాలు జరుగుతున్నాయన్న విషయం రాష్ట్రం మొత్తానికి తెలియాలన్న ఏకైక ఉద్దేశంతోే ఆయన ఈ ధర్నాకు ఉపక్రమించారు.

  పోలీస్ అధికారులు సీన్లన్నీ రక్తి కట్టించారు.

  ====================

  ఇది తెలుగు దేశం స్క్రిప్ట్ కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకంటే రసవత్తరంగా స్క్రిప్ట్ తయారు చేసుకుంది. చంద్రబాబు నాయుడు ధర్నాకు దిగితే, ఏం చేయాలన్న విషయంలో స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్నారు. అందుకే పోలీస్ అధికారులు, చంద్రబాబ ముందు మోకాళ్లపై కూర్చోవడం, రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం, వేడుకుంటున్నట్టు ప్రాధేయ పడటం.. ఇలాంటి సీన్లన్నీ రక్తి కట్టించారు. బయట ఎటువంటి గొడవలు జరగకుండా, ఎయిర్ పోర్ట్ రోడ్ లోనే వాహనాలు ఆపేశారు.

  చంద్రబాబు కోసం అన్నట్టు 2 అంబులెన్స్ వ్యాన్ లు, సీనియర్ డాక్టర్లను అక్కడే సిద్ధం చేసి ఉంచారు. ఆయన ఏం తింటారో అవన్నీ రెడీ చేశారు. ఆరోజు హైదరాబాద్ కి పోయే అన్ని విమానాల్లో టికెట్లు బుక్ చేసి సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ఆయన నిరాహార దీక్ష చేస్తే ఆరోగ్యం బాగా లేకపోతే ఏం చేయాలన్న విషయమై ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో, స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు సిద్ధం చేసి ఉంచారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఇరు వర్గాలకు తమది నాటకం అని తెలుసు. ఈ నాటకాన్ని ఎవరికి వారు, ఏ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు ఆస్వాదించ వచ్చు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?