ఓ కుర్రాడితో ఆంటీ మర్డర్ ప్లాన్..

    0
    481

    అక్రమ సంబంధం మోజులో ఓ ఆంటీ ,భర్తను చంపించే ప్రయత్నం చేసింది. అది వికటించి ఇప్పుడు చిక్కిపోయింది. భీంరాజ్ అనే వ్యక్తి , భార్య భాటియాతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. భర్త వయసు 45, ఆమె వయసు 41 ఏళ్ళు.. ఇటీవల ఆమెకు 23 ఏళ్ళ రోహన్ తో పరిచయం , అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భీంరాజ్ , భార్యను మందలించాడు. అయినా ఆమె తప్పేది పని మానలేదు. ఇద్దరిమధ్య అక్రమసంబంధం మరింత ముదిరింది.

    భర్త మందలింపు కూడా ఎక్కువ కావడంతో , భాటియా , భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు రోహన్ కు చెప్పింది. దీంతో రోహన్ భీంరాజ్ను చంపేందుకు పధకం పన్నాడు. ఒక తుపాకీ కొని , బైక్ నంబర్ ప్లేట్ కూడా మార్చాడు. బుధవారం భీంరాజ్ కారులో పోతుండగా , బైక్ లో పోతూ , కాల్పులు జరిపాడు. సిసి కెమెరాలో రికార్డయిన బైక్ నంబర్ తెలుసుకోలేక పోలీసు సతమతం అవుతున్న పరిస్థితుల్లో , భాటియా అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న పోలీసులు , కాల్పులు జరిగిన టైంలో రోహన్ , సెల్ సిగ్నల్స్ , కాల్ రికార్డ్స్ పరిశీలించి అసలు కుట్రను వెలుగులోకి తెచ్చారు. రోహన్ ను, ప్రియురాలు ఆంటీ భాటియాను అరెస్ట్ చేశారు. భీంరాజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??