ఆర్యన్ ఖాన్ కే బెయిల్ ఎందుకిచ్చారంటే..?

  0
  414

  ఆర్యన్ ఖాన్ కే బెయిల్ మంజూరు..
  అసలు బెయిల్ ఎందుకిచ్చారంటే..?

  డ్రగ్స్ కేసులో పట్టుబడిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. దాదాపుగా 20 రోజులపాటు ఆర్యన్ జైల్లోనే ఉన్నాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. షారుఖ్ ఖాన్ కూడా ఆర్యన్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. షారుఖ్ పెద్దపెద్ద వాళ్ళను పట్టుకొని.. బెయిల్ కోసం ప్రయత్నించినా బెయిల్ రాలేదు. అయితే తాజాగా బాంబే హైకోర్టు ఆర్యన్‌తో పాటు సహ నిందితులుగా ఉన్న అర్బాజ్‌, మూన్‌మూన్‌లకు బెయిల్‌ మంజూరు చేసింది.

  ఆర్యన్‌ ఖాన్‌ తరఫున ప్రముఖ లాయర్ ముకుల్‌ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు. ఆర్యన్ ఖాన్ వయస్సును దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరారు. వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్‌తో పాటు సహ నిందితులుగా ఉన్న అర్బాజ్‌, మూన్‌మూన్‌లకు కూడా బెయిల్‌ మంజూరు చేసింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..