షారుక్ కొడుకు ఆర్యన్ బాలీవుడ్ ఎంట్రీ …
అయితే హీరోగా మాత్రం కాదు…
===============
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ వెండితెర అరంగేట్రం ఎప్పుడా అని షారుక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడా సమయం వచ్చినట్లుంది. ఇటీవల ముంబై సముద్రంలో క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్ పార్టీలో ఎన్‌సీబీ అధికారులు చేసిన రైడ్ లో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో .. ఆర్యన్ ను అరెస్ట్ చేయడం సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే. అతికష్టం మీద ఆర్యన్ కు బెయిల్ లభించింది. ఈ కేసు ఇలా కొనసాగుతుండగానే… ఆర్యన్ ను ఇండస్ట్రీలోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో షారుక్ ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే అందరూ అనుకుంటున్నట్లు హీరోగా మాత్రం కాదు. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ల వద్ద ఫిల్మ్ మేకింగ్ క్లాసులు నేర్చుకుంటున్నాడట ఆర్యన్. అంటే హీరోగా కాకుండా డైరెక్టర్ గా రాణించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత హీరోగా వస్తాడనేది మరో టాక్. అదే నిజమైతే ఆర్యన్ త్వరలో అసిస్టెంట్ డైరెక్టర్‌గానే బిగ్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అవుతాడన్నమాట.
ఇవీ చదవండి…