తుఫాను ప్రభావంతో మళ్ళీ వారం పాటు వర్షాలే..

  0
  8270

  బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తుఫానుగా మారి నేరుగా తమిళనాడు ఉత్తర తీరం వైపుగా వస్తోంది. దీని వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. బుధవారం రాత్రికి ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతుంది. కోస్తా ప్రాంతానికి దగ్గరగా భాగా అభివృద్ధి చెంది తుఫానుగా ఉత్తర తమిళనాడు తీరాన్ని తాకనుంది. ఆ తర్వాత ఉత్తర వాయివ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. చిత్తూరు కడప జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు, కొన్ని చోట్లల్లో అతిభారీ వర్షాలు పడుతాయి. 10 వతేది రాత్రి నుంచి 12 తేదీ ఉదయం దాక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతాయి అని వాతావరణ సూచనగా ఉంది.

  నవంబర్ 11 మధ్యాహ్నానికి ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా కోస్తా, కృష్ణా జిల్లా కోస్తా భాగాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నవంబర్ 12 న కొంచం లోపల ఉండే ప్రాంటాలు ముఖ్యంగా గుంటూరు నగరం కానీ, విజయవాడ గానీ ఇలాంటి ప్రదేశాల్లో మనం వర్షాలను చూడొచ్చు. అనంతపురం జిల్లా మీదుగా వెళ్లనుంది కాబట్టి అనంతపురం జిల్లాలోని కొన్ని భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కర్నూలు జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలుంటాయి. అనంత, కర్నూలు జిల్లాల్లోని మిగిలిన చోట్ల తేలికపాటిగానే వర్షాలుంటాయి. విశాఖపట్నం నగరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కోస్తా భాగాల్లో మోస్తరు వర్షాలను మనం నవంబర్ 12 న చూడొచ్చు. లోపల ఉండే ప్రదేశాల్లో తక్కువగా వర్షాలుంటాయి. నవంబర్ 13 మరియు నవంబర్ 14 న వర్షాలు రాష్ట్రమంతటా అక్కడక్కడ కొనసాగుతాయి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..