మంత్రులంతా రాజీనామాలు.. టోటల్ క్లీన్ స్వీప్..

    0
    351

    ఏపీ రాష్ట్ర మంత్రివర్గం రాజీనామా సమర్పించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశంలో మొదట , కొన్ని అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. సున్నా వడ్డీ పధకం , మిలెట్ మిషన్ పథకంతో సహా , 36 అమలుపై కేబినెట్ చర్చించింది. అన్ని తీర్మానాలు అయినా తరువాత , సీఎం జగన్ , మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణకు సహకరించాలని కోరారు. దీంతో మంత్రులంతా , సీఎంకు మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ విషయంలో స్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో , తమ రాజీనామాలను సమర్పించారు.

    వాస్తవానికి అయితే , మంత్రులనుంచి , రాజీనామాలు తీసుకునేందుకే , ఈ సమావేశం ఏర్పాటైంది. ఇంతవరకు మంత్రులుగా , బాగా పని చేశారని , ఇకనుంచి మాజీలు అయినా , వారికీ పార్టీ పరమైన కీలక బాధ్యతలు ఉంటాయని చెప్పారు. గతంలో హామీ ఇచ్చినట్టు , రెండున్నరేళ్లు తరువాత , కొత్తవారికి చోటు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు చెప్పారు. మంత్రుల రాజీనామాలను , గవర్నర్ కి ఇచ్చి , అవి ఆమోదం పొందిన తరువాత , కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కి ఇస్తారు. 11 వతేదీన కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించారు..

    మంత్రివర్గం ఆఖరి సమావేశం సందర్భంగా మీడియాకు మంత్రి పేర్నినాని వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, కొడాలినాని పాల్గొన్నారు. మీడియా సహకారం తాను మరువలేనని నాని చెప్పారు..

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..