అనన్య మెడకు బిగుసుకున్నగంజాయి జాయ్

  0
  390

  బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అరెస్ట్ కి రంగం సిద్ధం చేసినట్టుంది. ఆమెను నిన్న పిలిపించి విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈరోజు కూడా అనన్య పాండేని తన కార్యాలయానికి పిలిపించారు. గంజాయికి సంబంధించి ఆర్యన్ ఖాన్ కు, అనన్య పాండేకు మధ్య జరిగిన వాట్సప్ చాట్ ను ఆమెకు చూపించారు.

  మొదట వాటిని జోక్ గా చాట్ చేశానని ఆమె చెప్పి తప్పించుకోడానికి ప్రయత్నం చేసినా, గట్టిగా విచారణ చేసే సరికి తాను మూడు సార్లు గంజాయి తెప్పించి ఆర్యన్ ఖాన్ కు ఇచ్చానని చెప్పింది. ఆర్యన్ ఖాన్ తో కలసి ఆమె డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు అంగీకరించింది.

  అనన్య పాండేకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు డ్రగ్స్ ఇతరులనుంచి పొందినట్టు కచ్చితమైన ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశా ఈరోజు రాత్రికే ఆమెను అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటి వరకు 20మందిని డ్రగ్స్ కేసుకి సంబంధించి అరెస్ట్ చేశారు. కార్డీలియా క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీలో ఈ మొత్తం డ్రగ్స్ బాలీవుడ్ మాఫియా కుట్ర బట్టబయలైంది. ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి.. ఈనెల 26వతేదీ ముంబై హైకోర్ట్ విచారణ చేయనుంది.

   

  ఇక ఆర్యన్ ఖాన్, అనన్య పాండే మధ్య చాలా కాలంగా రిలేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద ఫ్యామిలీల వారసులే కావడంతో ముందునుంచీ ఫ్రెండ్షిప్ ఉంది. రాత్రుళ్లు కూడా వీరిద్దరూ కలసి తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తర్వాత అనన్య పాండే అరెస్ట్ కి కూడా త్వరగానే రంగం సిద్ధం కావడం విశేషం.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..