పిల్లలు తప్పుచేస్తే పెద్దలకు శిక్ష.

    0
    976

    పిల్లలు తప్పులు చేస్తే, దానికి పెద్దలను బాధ్యులను చేస్తూ చట్టాలు రూపొందించే పనిలో చైనా ప్రభుత్వం ఉంది. ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ చట్టం పేరుతో ఒక ముసాయిదాను రూపొందించారు. పిల్లలు చేసే తప్పులకు వాళ్ల చెడు ప్రవర్తనకు పెద్దలను బాధ్యులను చేస్తారు. పెద్దలు పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాలని ఈ చట్టంలో చెప్పకుండా మూడు అంశాలపై పిల్లలకు పెద్దలు అవగాహన కల్పించాలని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. పార్టీని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి, సోషలిజాన్ని ప్రజలను ప్రేమించండి.. ఈ మూడు అంశాలపై చిన్నప్పటినుంచే పిల్లలకు పెద్దలు అవగాహన కల్పించాలి. అలా కాకుండా ఈ మూడు అంశాలకు విరుద్ధంగా పిల్లలు ప్రవర్తిస్తే, దానికి పెద్దల్ని బాధ్యులుగా చేసే చట్టం ఉంటుందని అధికార పార్టీ ప్రతినిధి జాన్ తేవి చెప్పారు.

    ఇంట్లో పెద్దల పట్ల కూడా గౌరవంగా ఉంటూ, చిన్న పిల్లల్ని కూడా ప్రేమగా చూసుకోవాలని ఈ చట్టంలో నిబంధన ఉంది. ఇటీవల కాలంలో చైనాలో ఆన్ లైన్ గేమ్స్ నుంచి మైనర్ పిల్లలను నిషేధించడం, వారాంతపు రోజుల్లో మూడు గంటలకంటే ఎక్కువగా పిల్లలు ఇటువంటి గేమ్స్ చూడకూడదనే నిబంధన పెట్టడం, ఆధ్యాత్మిక మత్తు ఎంత ప్రమాదకరమో, ఈ ఆన్ లైన్ గేమ్స్ కూడా అంతే ప్రమాదకరం అని చైనా భావిస్తోంది. ఈ ఆన్ లైన్ గేమ్స్ తో యువత నిర్వీర్యం అవుతోందని, రాబోయే తరాలు చెడిపోతాయని అభిప్రాయ పడుతోంది. ఇంటర్నెట్ సెలబ్రిటీస్ ను ఆరాధించడం మానుకొని, ఆన్ లైన్ గేమ్స్ మానుకొని, సాసర్ లాంటి గేమ్స్ ను ప్రోత్సహించాలని చైనా అభిప్రాయ పడింది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..