మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆమధ్య గంట, అరగటం.. అనే కామెంట్లతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఇప్పుడు ఏయ్ ఎస్సై ఎందుకయ్యా నీక ఉద్యోగం అంటూ మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ ఎస్సైతోపాటు, మరో జర్నలిస్ట్ ని ఆయన వేదికపైనుంచే బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Former Minister @AvanthiSrinivas made indecent remarks to media persons and police. Meanwhile, @YSRCParty leaders are facing outrage from the public during the Gadapa gadapaku mana prabutwam program. @ysjagan #AndhraPolitics #andhra pic.twitter.com/0qYf1pLh6G
— Balakrishna – The Journalist (@Balakrishna096) May 17, 2022
భీమిలిలోని పద్మనాభం మండలం కోరాడలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి అవంతి ఇలా రెచ్చిపోయారు. డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైకి కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఏయ్ ఎస్సై ఏం చేస్తున్నావనయ్యా.. ఇందుకేనా నీకు జీతం ఇచ్చేది అం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమం ఏర్పాటు చేసిన వారిపై కూడా అక్షింతలు వేశారు. ఎందుకయ్యా ఇలా కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తున్నారని అన్నారు అవంతి.